ఉల్లి లేని వంటిల్లు వెలవెలబోతోంది. ఉల్లిపాయ లేని కూర రుచించడం లేదు. వీటి కోసం రైతుబజార్ల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. ఉదయం, సాయంత్రం రెండుపూటలా కౌంటర్ల వద్ద వరుసల్లో నిలబడుతున్నారు. కేజీ ఉల్లిపాయల కోసం గంటల తరబడి వేచిచూస్తున్నారు. రైతుబజార్ల వద్ద క్యూలైన్లలో తరచూ తోపులాటలు జరుగుతున్నాయి. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సి వస్తోంది. ఉల్లి సరఫరా సక్రమంగా జరగడం లేదని... కౌంటర్లు పెంచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
గుంటూరు నగరంలో పట్టాభిపురం, చుట్టుగుంట రైతుబజార్లలో ఉల్లి సరఫరా చేస్తున్నప్పటికీ.. అవి వినియోగదారుల అవసరాలు తీర్చలేకపోతున్నాయి. ఒక్కొక్కరికి కిలో చొప్పున ఇస్తున్నా.. క్యూలో ఉన్న అందరికీ రావడంలేదు. ముందుగా టోకెన్లు ఇస్తే గంటల తరబడి నిల్చునే పరిస్థితి తప్పుతుందని నగరవాసులు కోరుతున్నారు. రేషన్ డీలర్లను కానీ గ్రామస్థాయిలో వాలంటీర్ల సేవలు గానీ వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.
ఇవీ చదవండి..