ETV Bharat / city

ప్రాణవాయువు అందించారు.. ప్రాణం పోశారు! - కొవిడ్​ బాధితులకు ప్రవాసాంధ్రుల చేయూత

దేశంలో కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్​ కోరతతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మరికొంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుస్థితిని చూసి కలత చెందిన పలువురు ప్రవాసాంధ్రులు ముందుకొచ్చారు. 280 ఆక్సిజన్ యంత్రాలను అందజేశారు. తమ స్నేహితుల ద్వారా పేదలకు ప్రాణవాయువు అందిస్తున్నారు.

nris provide to oxygen concentrators
ఆక్సిజన్​ యంత్రాలు అందజేసిన అమెరికా ప్రవాసాంధ్రులు
author img

By

Published : Jun 19, 2021, 11:16 AM IST

Updated : Jun 19, 2021, 2:12 PM IST

ప్రాణవాయువు అందించారు.. ప్రాణం పోశారు

దేశంలో కరోనా విలయతాండవం నేపథ్యంలో ఆక్సిజన్ అందక అనేక మంది చనిపోతున్న దుస్థితిని చూసి అమెరికాలోని ప్రవాసాంధ్రులు ఆవేదన చెందారు. ఆ ఆవేదన నుంచి రాజమండ్రికి చెందిన ఫణికాంత్​కు ఓ ఆలోచన వచ్చింది. ఆక్సిజన్ దొరక్క మృతిచెందుతున్న పేదలకు ఆక్సిజన్ అందించాలని నిర్ణయించుకున్నాడు. అమెరికాలోని తన స్నేహితులు.. మధు మాత్యు (కేరళ), మైథిలీ (హైదరాబాద్)కు విషయం చెప్పాడు. దీంతో అందరూ కలిసి సోషల్ మీడియా వేదికగా విరాళం కోసం సందేశాలు పెట్టారు.

280 ఆక్సిజన్ యంత్రాలను కొనుగులు

వీరి విజ్ఞప్తికి సేవాహృదయం కలిగిన చాలా మంది ఇచ్చిన విరాళాలతో రూ. 2 కోట్ల సేకరించారు. అ డబ్బుతో 280 ఆక్సిజన్ యంత్రాలు కొనుగులు చేసి ఇండియాకు పంపించారు. స్వదేశంలో ఆయా రాష్ట్రాల్లో సేవ చేయాలనుకునే స్నేహితులతో కలిసి ఆక్సిజన్​ అవసరమున్న పేదవారికి సమకూర్చారు. అలా 13 రాష్ట్రాల్లో పేదలకు ఈ యంత్రాలు.. ప్రాణ వాయువును అందిస్తున్నాయి.

సమాజ సేవ కోసం చాలా మంది స్పందించి విరాళాలు ఇచ్చారు. ఒక్క రూపాయి కూడా వృథా కాకుండా సమాజ సేవ చేయాలని అనుకున్నాం. అందులో భాగంగానే స్నేహితుల సహాయంతో ఆక్సిజన్​ యంత్రాలను అందజేస్తున్నాం. - ఫణికాంత్ (రాజమండ్రి), మైథిలి (హైదరాబాద్)

అమెరికా నుంచి ఇండియాకి ఆక్సిజన్ యంత్రాలు పంపాలంటే అనేక సమస్యలు ఎదురయ్యాయని...అయినా కష్టపడి వాటిని ఇండియాకి చేర్చినట్లు అమెరికా ప్రవాసాంధ్రులు(nris) చెప్పారు. కరోనా కష్టకాలంలో పేదలకు సేవ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

ఇదీ చదవండి:

Covid-19 In India: దేశంలో 60 వేల కొత్త కేసులు

Last Updated : Jun 19, 2021, 2:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.