గుంటూరులో నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేసిన ఐదు ఆస్పత్రులకు సంయుక్త కలెక్టర్ వివేక్‌యాదవ్ షోకాజ్ నోటీసు ఇచ్చారు. నగరంలో కొవిడ్ చికిత్సకు అనుమతించిన ఆసుపత్రులలో జిల్లా సంయుక్త కలెక్టర్, రెవెన్యూ అధికారులతో కలిసి తనిఖీలు చేపట్టారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే కొవిడ్ బాధితులకు ఎటువంటి రుసుము వసూలు చేయకుండా వైద్యసేవలు అందించాలన్నారు. ప్రజలకు అందిస్తున్న వైద్యసేవల్లో కానీ, ఫీజుల వసూళ్లలో కానీ ఇబ్బందుంటే కొవిడ్-19 కాల్‌సెంటర్, 104, స్పందన కాల్‌సెంటర్‌కు తెలియజేయవచ్చని వివేక్ యాదవ్ తెలిపారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ... నేటి నుంచే అమలు