ETV Bharat / city

Ramya Murder case: గుంటూరుకు జాతీయ ఎస్సీ కమిషన్ బృందం - national sc commission team reached to andhra pradesh news

జాతీయ ఎస్సీ కమిషన్ బృందం రాష్ట్రానికి చేరుకుంది. గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసుపై వాస్తవాలు తెలుసుకోనుంది. రమ్య హత్య జరిగిన ప్రాంతాన్ని కమిషన్ సభ్యులు పరిశీలించనున్నారు. ఆ తర్వాత రమ్య కుటుంబసభ్యులను కలిసి మాట్లాడతారు.

national sc commission
national sc commission
author img

By

Published : Aug 24, 2021, 8:35 AM IST

Updated : Aug 24, 2021, 10:04 AM IST

గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసుపై వాస్తవాలు తెలుసుకునేందుకు జాతీయ ఎస్సీ కమిషన్ బృందం రాష్ట్రానికి చేరుకుంది. వీరిలో కమిషన్‌ వైస్ ఛైర్మన్ హల్దార్‌, సభ్యులు అంజుబాల, సుభాష్ పార్థి ఉన్నారు. గన్నవరం చేరుకున్న కమిషన్‌ బృందానికి భాజపా నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు.

ఘటన ప్రాంతానికి కమిషన్ బృందం

ఉదయం 11 గంటలకు రమ్య హత్య జరిగిన ప్రాంతాన్ని కమిషన్ సభ్యులు పరిశీలిస్తారు. ఆ తర్వాత రమ్య కుటుంబసభ్యులను కలిసి మాట్లాడతారు. మధ్యాహ్నం 2గంటలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ ఇతర ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఎస్సీ కమిషన్ పర్యటన కోసం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. రమ్య హత్య జరిగిన ప్రదేశంతో పాటు ఆమె ఇంటి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎస్సీ కమిషన్ పర్యటన దృష్ట్యా ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

తెదేపా బృందం ఫిర్యాదు

మరోవైపు తెదేపా నేతల బృందం.. జాతీయ ఎస్సీ కమిషన్‌ను కలిసింది. వీరిలో నక్కా ఆనంద్‌బాబు, వర్ల రామయ్య, శ్రావణ్‌కుమార్‌ లు ఉన్నారు. రమ్య హత్య ఘటన, ఎస్సీలపై దాడులపై ఫిర్యాదు చేశారు.

అనుబంధ కథనం:

Murder: గుంటూరులో బీటెక్ విద్యార్థిని దారుణ హత్య.. కత్తితో పొడిచిన దుండగుడు

Murder Video CC Footage: బీటెక్ విద్యార్థిని దారుణ హత్య.. సీసీ కెమెరాలో దృశ్యాలు!

Last Updated : Aug 24, 2021, 10:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.