దిల్లీ ధర్మపోరాట దీక్షకు మద్ధతుగా గుంటూరులో నన్నపనేని దీక్ష హస్తినలో ముఖ్యమంత్రి చంద్రబాబు తలపెట్టిన ధర్మపోరాట దీక్షకు.. రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి మద్దతు తెలిపారు. గుంటూరు హిందూ కళాశాల ప్రధాన కూడలి వద్ద నన్నపనేని దీక్షకు దిగారు. విభజన చట్టంలోని హామీలను నేరవేర్చకుండా కేంద్రం రాష్ట్రానికి నమ్మకదోహ్రం చేసిందన్నారు.