ETV Bharat / city

'పోలీసు వ్యవస్థలో కొందరి వైఖరి దారుణంగా ఉంది' - ycp attacks on tdp cadre

పల్నాడులో తెదేపా కార్యకర్తలను భయాందోళనకు గురిచేస్తున్నారని మాజీమంత్రి నక్కా ఆనంద్‌బాబు ఆరోపించారు. తమ పార్టీ నేతలను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గుంటూరులో వైకాపా బాధిత తెదేపా కార్యకర్తలతో పార్టీ నేతల సమావేశమయ్యారు.

నక్కా ఆనంద్‌బాబు
author img

By

Published : Oct 19, 2019, 6:43 PM IST

గుంటూరు జిల్లా పల్నాడులో తెదేపా కార్యకర్తలను భయాందోళనకు గురిచేస్తున్నారని మాజీమంత్రి నక్కా ఆనంద్‌బాబు ఆరోపించారు. గుంటూరులో వైకాపా బాధిత తెదేపా కార్యకర్తలతో పార్టీ నేతల సమావేశమయ్యారు. ఆత్మకూరు, పిన్నెల్లి, జంగమేశ్వరపాడు నుంచి వచ్చిన తెదేపా కార్యకర్తలతో నక్కా ఆనంద్​బాబు, మద్దాలి గిరిధర్, అశోక్‌బాబు, యరపతినేని శ్రీనివాసరావు భేటీ అయ్యారు.

పల్నాడులోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు పార్టీ తరపున పూర్తి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తెదేపా హయాంలో ప్రజాస్వామ్యయుతంగా పనిచేశామన్న నక్కా ఆనంద్‌బాబు... తమ పార్టీ నేతలను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
పోలీసు వ్యవస్థలో కొందరి వైఖరి దారుణంగా ఉందని ఆక్షేపించారు.

అగ్రిగోల్డ్ బాధితులకు రూ.260 కోట్లు ఇస్తున్నట్లు గొప్పగా చెబుతున్నారని మాజీమంత్రి ఆనంద్‌బాబు విమర్శించారు. తెదేపా హయాంలో రూ.310 కోట్ల సాయానికి సంబంధించి జీవో ఇచ్చిన విషయం గుర్తుచేశారు. తాము ఇచ్చిన మొత్తంలో రూ.50 కోట్లు తగ్గించి ఇవ్వడం దారుణమన్నారు. అగ్రిగోల్డ్ బాధితులను వైకాపా ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు.

నక్కా ఆనంద్‌బాబు

ఇదీ చదవండీ... 'తెదేపాతో భాజపా ఎప్పటికీ పొత్తు పెట్టుకోదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.