ETV Bharat / city

సమస్యలపై 14, 15న మున్సిపల్​ కార్మికుల సమ్మె - anantapur district news

తమ సమస్యలను పరిష్కరించాలంటూ మున్సిపల్​ కాంట్రాక్ట్​ కార్మికులు వినూత్నంగా నిరసన చేపట్టారు. గుంటూరు, అనంతపురం జిల్లాల్లో నినాదాలు చేపట్టారు. ఇచ్చిన హామీలు నెరవేర్చి.. రెగ్యులరైజ్​ చేయాలని వారు కోరారు.

muncipal employees agitation for their demands fulfillment
సమస్యలపై 14, 15న మున్సిపల్​ కార్మికుల సమ్మే
author img

By

Published : Jun 11, 2021, 10:19 PM IST

మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని అనంతపురంలో సీఐటీయూ కార్మిక సంఘాలు అర్ధనగ్న నిరసన చేపట్టాయి. తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నగరంలోని కోర్టు రోడ్డు సమీపంలో నినాదాలు చేశారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నా.. కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో వేతనాలు ఇవ్వాలని, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు.

గుంటూరు జిల్లాలో..

నరసరావుపేటలో సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు వినూత్నంగా మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగాల విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసి కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. జూన్ 14, 15 తేదీల్లో మున్సిపల్ కార్మికుల సమస్యలపై నిర్వహించే సమ్మె కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.

ఇవీ చదవండి:

టెస్ట్​ లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్​.. ఎలాగంటే?

LIQUOR SEIZED: సెప్టిక్​ ట్యాంక్ అనుకుంటున్నారా? మీరే చూడండి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.