సైడ్ కాలువల్లో వ్యర్థాలు వేసిన వారికి అపరాధ రుసుం విధించాలని గుంటూరు నగర కమిషనర్ చల్లా అనురాధ ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. గుంటూరులోని యస్.వి.యన్ కాలనీ, గుజ్జనగండ్ల ప్రాంతాల్లో పర్యటించిన కమిషనర్... తనిఖీలు చేసి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. వర్షాల నేపథ్యంలో...రోడ్లపై నీరు నిలబడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరంలోని లోతట్టు ప్రాంతాలను ముందుగానే గుర్తించి, సదరు ప్రాంతాలలో తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
ఇదీ చదవండి