ETV Bharat / city

బాధిత రైతులకు పరిహారం అందించండి: ఎంపీ గల్లా - mp galla jayadev news

నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని ఎంపీ గల్లా జయదేవ్ డిమాండ్ చేశారు. చేబ్రోలు మండలంలో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు.

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎంపీ గల్లా

author img

By

Published : Dec 1, 2020, 1:55 PM IST

నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులను, కౌలు రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. తుపాను ప్రభావం ఆగిపోయి ఐదు రోజులు అవుతున్నప్పటికీ పంట పరిహారం నమోదు చేసేందుకు ఇంతవరకు అధికారులు పొలాల వైపు రాకపోవడం దారుణమన్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని నారాకోడూరు, వేజెండ్ల, శుద్ధపల్లి, వడ్లమూడి, చేబ్రోలు గ్రామాల్లో పడిపోయిన పంట పొలాలను స్థానిక మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్​తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పలు ప్రాంతాల్లో మురుగు కాలువలు లేక వర్షపు నీరు పోయే మార్గం లేక పడిపోయిన పంటపైనే ఆ నీరంతా నిల్వ ఉంటున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారంలోకి రాకముందు వైకాపా నాయకులు రైతులకు అది చేస్తాం.. ఇది చేస్తామని ప్రలోభపెట్టి.... అధికారంలోకి వచ్చిన తర్వాత వారి వైపు కన్నెత్తి చూడకపోవడం బాధాకరమన్నారు. కృష్ణా వరదల వల్ల నష్టపోయిన రైతులకు రెండో విడత సాయం ఇప్పటివరకు అందించలేదని...వారికి వెంటనే పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

కృష్ణా జిల్లాలో అరుదైన పునుగు పిల్లి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.