ETV Bharat / city

అన్నీ ఆరోపణలే... వాటిలో ఎలాంటి వాస్తవం లేదు: ఎమ్మెల్యే ముస్తఫా - గుంటూరు తూర్పు ఎమ్మెల్యే పై వార్తలు

అవినీతికి పాలపడుతున్నారని తెదేపా నాయకులు తనపై చేస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా స్పందించారు. ఆ ఆరోపణలలో ఎలాంటి వాస్తవం లేదన్నారు.

mla-musthafa-on-tdp-leaders
mla-musthafa-on-tdp-leaders
author img

By

Published : Sep 16, 2020, 9:02 AM IST

Updated : Sep 16, 2020, 10:21 AM IST

గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, తాడికొండ ఎమ్మెల్యే అవినీతికి పాలపడుతున్నారని తెదేపా ఆరోపణలను ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా ఖండించారు. తెదేపా నేతల ఆరోపణులలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. తాను నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి, ప్రజలలో తనకు లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేని ప్రతిపక్షం నేతలు తనపై నిరాధార ఆరోపణలను చేస్తున్నారని చెప్పారు. తనకు సంబంధం లేని విషయాలను అంటగట్టి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహించారు.

కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే ముస్తఫా, ఎమ్మెల్యే మద్దాలి గిరి పేర్లు చెప్పి వాలంటీర్లు, అంగన్వాడీ పోస్టులు, ఆస్పత్రి బెడ్ లు ఇప్పిస్తామని మోసం చేస్తున్న వైనం తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు ముస్తఫా చెప్పారు. త్వరలోనే నిజానిజాలు అందరికి తెలుస్తాయన్నారు.

ఇదీ చదవండి:

రాజధాని భూముల కేసుపై ఏపీ హైకోర్టు స్టే

Last Updated : Sep 16, 2020, 10:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.