ETV Bharat / city

Mizoram Governor Haribabu Tour: తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుండాలి: గవర్నర్ హరిబాబు - mizoram governor haribabu news

mizoram governor haribabu visit guntur district: మిజోరం రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు.. గుంటూరు జిల్లాలో పర్యటించారు. ఒక తెలుగువాడిగా రెండు తెలుగు రాష్ట్రాలూ.. అభివృద్ధిలో ముందుండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

మిజోరం హరిబాబు గుంటూరులో పర్యటన
మిజోరం హరిబాబు గుంటూరులో పర్యటన
author img

By

Published : Jan 5, 2022, 12:48 PM IST

Updated : Jan 5, 2022, 2:26 PM IST

Mizoram Governor Haribabu Guntur Tour: ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే.. భారతదేశం మొత్తం అభివృద్ధి సాధించినట్లు అవుతుందని మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు అభిప్రాయపడ్డారు. ఒక తెలుగువాడిగా రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుండాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. గుంటూరు జిల్లాలో గవర్నర్ కంభంపాటి హరిబాబు పర్యటించారు. ఈ సందర్భంగా.. గుంటూరు నగరంలోని భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ నివాసంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు.

అనంతరం.. అక్కడి నుంచి మంగళగిరి శివారులోని పెదవడ్లపూడి వెళ్లారు. స్థానిక సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అక్కడే ఉన్న గోశాలలో గోవులకు అరటిపళ్లు, బెల్లం తినిపించారు. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన హరిబాబు.. పెదపలకలూరులోని గుంటూరు క్లబ్​లో జరిగే సంక్రాంతి సంబరాలలో పాల్గొననున్నారు.

ఇదీ చదవండి..: PERNI NANI COMMENTS ON RGV: సినిమాను నిత్యావసరంగా లేదా అత్యవసరంగా భావించట్లేదు: పేర్ని నాని

Last Updated : Jan 5, 2022, 2:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.