ETV Bharat / city

'జీజీహెచ్​లో రోగుల సహాయకులకు ఉచిత భోజన సదుపాయం' - గుంటూరు జీజీహెచ్ వార్తలు

గుంటూరు జీజీహెచ్​లో రోగుల సహాయకులకు రెండు పూటలా ఉచిత భోజన సుదుపాయం కల్పిస్తామని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. ఈ సేవా కార్యక్రమానికి తన వంతుగా కోటి రూపాయలు విరాళం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తలు, దాతలు ఈ కార్యక్రమానికి చేయూతనివ్వాలని కోరారు.

Minister sriranganatha raju
Minister sriranganatha raju
author img

By

Published : Oct 15, 2020, 5:25 PM IST

గుంటూరు సర్వజనాస్పత్రిలో...రోగుల సహాయకులకు కూడా రెండు పూటలా భోజన సదుపాయం కల్పిస్తామని జిల్లా ఇన్​ఛార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు చెప్పారు. ఉదయం, సాయంత్రం రెండుపూటలా 200 మందికి ఆహారం అందిస్తామని తెలిపారు. పార్టీలకు అతీతంగా జరుగుతున్న సేవా కార్యక్రమానికి తనవంతుగా కోటి రూపాయలు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. స్వచ్ఛందసంస్థలు, పారిశ్రామికవేత్తలు, దాతలు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి చేయూత అందించాలని మంత్రి కోరారు.

మంత్రి శ్రీరంగనాథరాజు...ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యేలు గిరిధర్, ముస్తపా, కలెక్టర్ శామ్యూల్ అనంద్ కుమార్​తో కలసి జీజీహెచ్​లో పర్యటించారు. మాత, శిశు ఆస్పత్రి నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. వైద్యులు, సిబ్బంది ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తున్నామన్నారు.

ఇదీ చదవండి : ఆడ బిడ్డలకు రక్షణ ఇవ్వని చట్టాలు ఎందుకు..?: పవన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.