Minister Dharmana: రెవెన్యూ శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకువస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. త్వరలో ఆటోమేటిక్ మ్యూటేషన్ విధానాన్నితీసుకురానున్నట్లు తెలిపారు. టైటిలింగ్ విధానాన్ని పూర్తిగా ఆధునీకరిస్తామని స్పష్టం చేశారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతావనిలో రెవెన్యూ శాఖలో ఇలాంటి కార్యక్రమాన్ని ఎవరూ చేపట్టలేదన్నారు. రీసర్వేతో భూ వివాదాలు పరిష్కారమవుతాయన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు.
గుంటూరులో జిల్లా అభివృద్ధి సమీక్ష మండలి సమావేశానికి మంత్రి ధర్మాన హాజరయ్యారు. జిల్లాకు సంబంధించి పలు సమస్యలపై చర్చించారు. గుంటూరు కెనాల్ విస్తరణకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. సహకార బ్యాంకులో అక్రమాలపై విచారణ జరిపిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇంటి స్థలాలను సేకరించి ఇస్తున్నామన్న ధర్మాన... రూ.12వేల కోట్లతో ఈ ప్రక్రియ జరుగుతోందని చెప్పారు. పేద ప్రజల ఇళ్ల నిర్మాణాలు... వచ్చే డిసెంబరులోగా పూర్తికానున్నాయని అంచనా వేశారు.
ఇవీ చదవండి: