ప్రభుత్వం ఎక్కువ మందికి టీకా అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కు శ్రీకారం చుట్టడంతో.. దానికి గుంటూరు జిల్లా నుంచి విశేషస్పందన లభిస్తోంది. అత్యధికంగా ఒక్కరోజులోనే భారీ సంఖ్యలో ప్రజలకు టీకాలు అందించే క్రమంలో.. జిల్లాలో మొత్తం 415 వ్యాక్సినేషన్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. గుంటూరులోని మాజేటి గురవయ్య పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ క్యాంపును జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ చల్లా అనురాధ పరిశీలించారు. 45 సంవత్సరాలు పైబడిన వారికి, 5 ఏళ్ల లోపు చిన్నారులున్న తల్లులకు మొదటి డోసు, మొదటి డోసు తీసుకుని కాలపరిమితి పూర్తైన వారికి రెండో డోసు ఇస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. జూన్ 21 నుంచి వ్యాక్సినేషన్ డోసులు మరిన్ని అందుబాటులో ఉంటాయని.. అర్హులందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఇవీ చదవండి: