అంబేడ్కర్‌నే స్పూర్తిగా తీసుకుని యువత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం సూచించారు. అస్పృశ్యతకు వ్యతిరేకంగా... సమసమాజం కోసం బాబాసాహెబ్ జీవితాంతం పోరాడారని గుర్తు చేశారు. దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన అంబేడ్కర్... నిమ్నవర్గాలే కాకుండా అన్నివర్గాలకు ఆదర్శనీయుడని చెప్పారు. గుంటూరులోని లాడ్జ్‌సెంటర్‌లో అంబేడ్కర్ 128వ జయంతి ఉత్సవాలకు హాజరైన ఎల్వీ సుబ్రమణ్యం.... పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కోన శశిధర్‌తోపాటు సీనియర్ ఐఏఎస్ అధికారి రావత్, పోలా భాస్కర్, నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీకేశ్ లత్కర్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి.నవ వధువును అవమానించిన కట్టుబాటు!