గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం పుష్కర్ ఘాట్ వద్ద ఉన్న శివుడి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ధ్వంసమైన శివుని విగ్రహాన్ని తాళ్లాయపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శివానందస్వామి సందర్శించారు. ఈ దుర్ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. శివుడి విగ్రహం ధ్వంసం చేసిన వారిని వెంటనే పట్టుకోవాలని గుంటూరు జిల్లా ఎస్పీని ఆదేశించారు. ఇలాంటి దాడులను ఉపేక్షించబోమని మంత్రి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
మాస్క్ పెట్టుకోమన్నందుకు ఉద్యోగినిపై అధికారి చాక్, కర్రతో దాడి