ETV Bharat / city

అమరావతిలో న్యాయసేవా సదస్సులు.. ఎప్పటినుంచంటే? - గుంటూరు జిల్లా తాజా వార్తలు

Legal Service Conferences: రైతులపై పెట్టిన అక్రమ కేసులు, ఇతర సమస్యల పరిష్కారం కోసం రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాలలో న్యాయసేవా సదస్సులు నిర్వహిస్తామని ప్రముఖ న్యాయవాది వెంకటేశ్వర్లు తెలిపారు.

Legal Service Conferences
త్వరలో అమరావతిలో న్యాయసేవా సదస్సులు
author img

By

Published : Apr 13, 2022, 3:48 PM IST

Legal Service Conferences: రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో.. త్వరలో న్యాయసేవా సదస్సులు నిర్వహిస్తామని ప్రముఖ న్యాయవాది వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళగిరిలోని ఐబీఎన్​ భవన్​లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధానిలో రైతులపై పెట్టిన అక్రమ కేసులు, ఇతర సమస్యల పరిష్కారం కోసం.. అమరావతిలో న్యాయ సేవ సదస్సులు పెట్టాలని జాతీయ న్యాయ సేవా సంస్థకు లేఖ రాసినట్లు వెంకటేశ్వర్లు తెలిపారు. లేఖపై స్పందించిన జాతీయ న్యాయ సేవా సంస్థ.. అమరావతిలో న్యాయసేవా సదస్సులు ఏర్పాటు చేయాలని హైకోర్టుకు సూచించిందని చెప్పారు. త్వరలోనే అన్ని గ్రామాలలో న్యాయసేవా సదస్సులు జరిగే అవకాశం ఉందని వెంకటేశ్వర రావు వెల్లడించారు.

రాజధాని ప్రాంతంలో ఒక రైతుపై ఉద్యమ సమయంలో అక్రమ కేసులు పెట్టారని సీతారామయ్య అనే రైతు చెప్పారు. కేసులపై అవగాహన లేకపోవడంతో న్యాయస్థానం చుట్టూ తిరుగుతున్నామన్నారు. న్యాయ సేవా సదస్సులు నిర్వహిస్తే తమకు కొంత అవగాహన కలుగుతుందని సదరు రైతు అన్నారు.

ఇదీ చదవండి: "జగన్ బాదుడే బాదుడు" రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నిరసనలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.