రాష్ట్రంలోనే ప్రముఖ కవులుగా కొప్పరపు కవులకు గుర్తింపు ఉందని నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వీరి విగ్రహావిష్కరణను జనవరి రెండో వారంలో గుంటూరు జిల్లా నరసారావుపేట టౌన్హాల్లో చేయనున్నట్లు శ్రీనివాసరెడ్డి తెలిపారు. కొప్పురపు వెంకట సుబ్బరాయ కవి, కొప్పురపు వెంకట రమణ కవులు సుమారు మూడు లక్షల పద్యాలను రాశారుని... పల్నాడుకే కీర్తిప్రతిష్ఠలు తెచ్చిపెట్టారని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమానికి సినీ నటులు బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, తెలుగుభాషా అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, లక్ష్మీపార్వతి, తదితరులు రానున్నట్లు గోపిరెడ్డి వివరించారు.
ఇదీ చూడండి: