కోడెల శివప్రసాదరావు అకాల మరణంపై ఆయన కుటుంబసభ్యులు స్పందించారు. తమ ఇంట్లో ఎలాంటి గొడవలు లేవని కోడెల శివప్రసాద్ భార్య తెలిపారు. తన తండ్రి మృతిపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయని కోడెల కుమార్తె విజయలక్ష్మీ ఆవేదన చెందారు. చనిపోయిన వ్యక్తిపై తప్పుడు ప్రచారాలు తగదన్నారు. ప్రభుత్వం మారినప్పటి నుంచి తన తండ్రిపై వేధింపులు మొదలయ్యాయని విజయలక్ష్మీ అన్నారు. కంటినిండా నిద్ర లేకుండా మూణ్నెళ్లుగా తన తండ్రిని వేధించారని ఆమె ఆరోపించారు. కనీసం ఆయన వయసుకు కూడా విలువ ఇవ్వకుండా అవమానించారన్నారు. తాను, తన సోదరుడు శివరాంపై తీవ్రమైన దుష్ప్రచారాలు చేస్తున్నారని విజయలక్ష్మీ కన్నీటిపర్యంతమయ్యారు.
ఇదీ చదవండి :