ETV Bharat / city

పదో తరగతి పరీక్షలు రద్దు చేయండి : కన్నా లక్ష్మీనారాయణ - పదో తరగతి పరీక్షలు రద్దు

పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సీఎం జగన్​కు లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉండడంతో విద్యార్థులను ఒకచోట చేర్చడం సరైన ఆలోచన కాదన్నారు.

కన్నా లక్ష్మినారాయణ
కన్నా లక్ష్మినారాయణ
author img

By

Published : Jun 17, 2020, 12:07 PM IST

పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి జగన్​కు లేఖ రాశారు. రాష్ట్రంలో కొవిడ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయని... సామాజిక వ్యాప్తి దిశగా సాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించటం విద్యార్థులకు ప్రమాదమన్నారు.

పరీక్షల పేరుతో ఎక్కువమందిని ఓ చోటకు చేర్చటం సరైన ఆలోచన కాదని కన్నా అభిప్రాయపడ్డారు. ఇప్పటికే పొరుగు రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలు రద్దు చేసిన విషయం గుర్తించాలన్నారు. పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను తర్వాత తరగతికి అప్​గ్రేడ్ చేయాలని లేఖలో కోరారు.

ఇదీ చదవండి : పదోతరగతి పరీక్షలు రద్దు చేయాలి: పవన్ కల్యాణ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.