ETV Bharat / city

'ప్రభుత్వ అండతోనే హిందూ దేవాలయాలు, ఆస్తులపై దాడులు' - kanna comments on jagan

అంతర్వేది ఘటనకు కారణమైన వారిని పట్టుకోవాలని భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. అధికారులపై చర్యలు తీసుకున్నామని చెబుతూ... అసలు నిందితులను ప్రభుత్వం వదిలేస్తోందని ఆరోపించారు. అంతర్వేది ఘటన, హిందూ దేవాలయాలపై దాడులకు నిరసనగా కన్నా నిరసన దీక్ష చేపట్టారు.

Kanna Laxminaraya protest over attack on Hindu temples in ap
కన్నా లక్ష్మీనారాయణ దీక్ష
author img

By

Published : Sep 10, 2020, 2:51 PM IST

ప్రభుత్వ అండతోనే హిందూ దేవాలయాలు, ఆస్తులపై వరుస దాడులు జరుగుతున్నాయని భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. అంతర్వేది రథం దగ్ధం ఘటనపై అసలైన నిందితులను ప్రభుత్వం ఇంతవరకూ పట్టుకోలేదన్న కన్నా... అధికారులపై చర్యలు తీసుకున్నామంటూ చేతులు దులుపుకోవడం సరికాదన్నారు.

మతిస్థిమితం లేదనివారు చేసిన పనంటూ తప్పించుకోవడానికి వీల్లేదని... పథకం ప్రకారమే జరిగిన దాడి అని కన్నా అభిప్రాయపడ్డారు. అంతర్వేది ఘటన, హిందూ ఆలయాలపై దాడులకు నిరసనగా మాజీమంత్రులు శనక్కాయల అరుణ, రావెల కిశోర్ బాబుతో కలిసి కన్నా నిరసన దీక్షలు చేపట్టారు. నష్టపోయిన దేవాలయాలను, ఆస్తులను తక్షణం పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

మూడు రాజధానులు తప్పు లేదు.. హైకోర్టులో కేంద్రం అఫిడవిట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.