ETV Bharat / city

జగన్​కు తన పాలనపై నమ్మకం లేదు: కన్నా లక్ష్మీనారాయణ - Kanna Lakshmi Narayana comments on Jagan

ఇతర పార్టీల అభ్యర్థుల నామినేషన్లు వెనక్కు తీసుకోవాలని వైకాపా నేతలు పోలీసులతో బెదిరించారని.. భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. గుంటూరు నగరంలోని 32వ డివిజన్​లో భాజపా ఎన్నికల కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

కన్నా లక్ష్మీనారాయణ
కన్నా లక్ష్మీనారాయణ
author img

By

Published : Mar 3, 2021, 9:21 PM IST

ముఖ్యమంత్రి జగన్​కు తన పాలనపై నమ్మకం లేకే మున్సిపల్ ఎన్నికల్లో ఇతర పార్టీలవారిని బెదిరిస్తున్నారని.. భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. గుంటూరు నగరంలోని 32వ డివిజన్​లో భాజపా ఎన్నికల కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ అభ్యర్థుల నామినేషన్లు వెనక్కు తీసుకోవాలని వైకాపా నేతలు పోలీసులతో బెదిరించారని ఆరోపించారు. ఎన్నికలకు ముందే అభ్యర్థులను కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

కన్నా లక్ష్మీనారాయణ

వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్థానిక ఎన్నికలు జరిగాయని.. అప్పట్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు వెళ్లామని కన్నా గుర్తుచేశారు. అధికార దుర్వినియోగంతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా తయారైందని వ్యాఖ్యానించారు. గుంటూరు అభివృద్ధి అంతా తాను మంత్రిగా ఉన్న సమయంలో జరిగిందేనని పేర్కొన్నారు. 24గంటల తాగునీటి పథకం ఎందుకు ప్రారంభించలేదో ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండీ... పురపాలక ఎన్నికల్లో ముగిసిన మరో ఘట్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.