గుంటూరులో కాళిమాత ఆలయాన్ని తొలగించేందుకు అధికారులు ప్రయత్నించటం ఉద్రిక్తతలకు దారితీసింది. రోడ్డు విస్తరణలో భాగంగా టీజేపీఎస్ కళాశాల సమీపంలో ఉన్న ఆలయాన్ని తొలగించాలని నగరపాలక సంస్థ అధికారులు నిర్ణయించారు. కొన్ని రోజులుగా ఆలయాన్ని తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇవాళ కూడా నగరపాలక సంస్థ సిబ్బంది ఆలయం తొలగించేందుకు రాగా.. స్థానికులు అడ్డుకున్నారు. స్థానికులు ఆందోళనకు దిగటంతో అధికారులు వెనక్కి వెళ్లారు.
గుడిని తొలగించే చర్యలు ఆపాలని స్థానికులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని పట్టాభిపురం స్టేషన్కు తరలించారు. ప్రభుత్వం, పోలీసుల తీరును నిరసిస్తూ.. మరికొందరు స్థానికులు ఆలయం వద్ద ఆందోళన చేపట్టారు. వీరికి శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి, భాజపా నాయకులు మద్దతు పలికారు. హిందువులంతా మౌనంగా ఉండటం వల్లే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని శివస్వామి అన్నారు. ఆలయ కూల్చివేత ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : పేర్ని నానిపై దాడి కేసు: కొల్లు రవీంద్ర ఇంటికి పోలీసులు