రాష్ట్ర రాజకీయాలు కులాల మధ్య గొడవల్లా తయారయ్యాయని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో... రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలతో పవన్ సమావేశమయ్యారు. స్థానిక సమస్యలను కార్యకర్తలు పవన్ దృష్టికి తెచ్చారు. డబ్బుతో ఓట్లు కొనే రాజకీయాలను మార్చగలిగే శక్తి జనసేనకు ఉందని పవన్ వ్యాఖ్యానించారు. కుళ్లు, కుతంత్రాలు, వెన్నుపోట్లను తట్టుకొని ఉంటాననే నమ్మకంతోనే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ ఉద్ఘాటించారు.
రెండు కులాల మధ్య గొడవలా రాష్ట్ర రాజకీయాలు: పవన్ - మంగళగిరిలో పనన్ మీటింగ్
రేపల్లె నియోజకవర్గ కార్యకర్తలతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. స్థానిక సమస్యలను కార్యకర్తలు పవన్ దృష్టికి తీసుకొచ్చారు. రెండు కులాల మధ్య గొడవలా రాష్ట్ర రాజకీయాలు మారాయని... అభిమానులను ఓట్లుగా మార్చలేకపోయామని జనసేనాని అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర రాజకీయాలు కులాల మధ్య గొడవల్లా తయారయ్యాయని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో... రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలతో పవన్ సమావేశమయ్యారు. స్థానిక సమస్యలను కార్యకర్తలు పవన్ దృష్టికి తెచ్చారు. డబ్బుతో ఓట్లు కొనే రాజకీయాలను మార్చగలిగే శక్తి జనసేనకు ఉందని పవన్ వ్యాఖ్యానించారు. కుళ్లు, కుతంత్రాలు, వెన్నుపోట్లను తట్టుకొని ఉంటాననే నమ్మకంతోనే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ ఉద్ఘాటించారు.
ఇవీ చూడండి-'రూ.2 వేల కోట్లు దొరికాయని మేము అనలేదు'