ETV Bharat / city

'ప్రలోభాలు, బెదిరింపులతో వైకాపా అభ్యర్థులు గెలిచారు' - గుంటూరులో జనసేన ప్రెస్ మీట్

మున్సిపల్ ఎన్నికల్లో వైకాపాది నిజమైన గెలుపు కాదని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ప్రలోభాలు, బెదిరింపులు, దౌర్జన్యాలతో వైకాపా అభ్యర్థులు గెలిచారని ఆరోపించారు.

municipal elections results
జనసేన
author img

By

Published : Mar 15, 2021, 3:24 PM IST

మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా విజయంపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ విమర్శలు చేశారు. ఎన్నికల్లో బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడ్డి వైకాపా గెలిచిందని ఆరోపించారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వైకాపా పాలనపై విసుగుచెందిన ప్రజలు జనసేన వైపు మొగ్గు చూపుతున్నారని.. 2024లో జనసేన అధికారంలోకి రావడం ఖాయం అన్నారు.

జనసేన జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేసిందని... అత్యధిక మెజారిటీతో రెండు స్థానాలు గెలిచినట్లు పేర్కొన్నారు. సంక్షేమ పథకాలతో గెలిచామని చెప్పుకుంటున్న వైకాపా.. ప్రతి డివిజన్​కు​ ఓ ఇన్​ఛార్జీని నియమించి విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా నియంత పోకడలు మానుకొని ప్రజలకు మెరుగైన పాలన అందించాలని సూచించారు.

ఇదీ చూడండి: విజయవాడలో జనసేన అభ్యర్థుల ఓటమికి భాజపానే కారణం: పోతిన మహేశ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.