ETV Bharat / city

ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో శ్రమజీవుల పాత్ర కీలకం: పవన్ - pawan kalyan latest news

కార్మికులకు జనసేన పార్టీ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ పురోగతికి, ఆర్థిక వ్యవస్థ వృద్ధికి శ్రమ జీవుల పాత్ర ఎనలేనిదని పవన్ అన్నారు. కరోనాతో ఇబ్బందులు పడుతున్న కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

janasena leader pawan kalyan giving may day wishes to Labor
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌
author img

By

Published : Apr 30, 2021, 7:35 PM IST

Updated : Apr 30, 2021, 10:29 PM IST

ప్రపంచ పురోగతి, ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో శ్రమజీవుల పాత్ర కీలకమని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. అభివృద్ధిలో శ్రామిక సోదరులు ధారపోసిన స్వేద జలానికి విలువ కట్టలేమన్న ఆయన.. తమ హక్కుల సాధన కోసం కార్మికులు రక్తం చిందించి, పోరాడి సాధించిన రోజే మేడే అని తెలిపారు. కార్మికుల శ్రమను ప్రతి ఒక్కరూ గౌరవించినప్పుడే వారి కళ్లల్లో నిజమైన ఆనందాన్ని చూస్తామని పవన్ పేర్కొన్నారు.

కార్మికులకు తన తరఫున, జనసేన పార్టీ తరఫున కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పరిశ్రమల్లో, వాణిజ్య సంస్థల్లో పని చేస్తున్న వారి నుంచి అసంఘటిత రంగాల్లో ఉన్నవారి వరకూ అందరికీ కార్మిక చట్టాలు పకడ్బందీగా అమలు కావాలన్నదే జనసేన పార్టీ ఆకాంక్ష అని పవన్ వెల్లడించారు. కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉన్న ఈ విపత్కర పరిస్థితిలో కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కష్ట జీవుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత పాలకులపై ఉందని జనసేన అధినేత స్పష్టం చేశారు.

ఇదీచదవండి. రాష్ట్రంలో కరోనా కల్లోలం..కొత్తగా 17,354 కేసులు, 64 మరణాలు

Last Updated : Apr 30, 2021, 10:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.