గుంటూరు ఏటీ అగ్రహారంలో దారుణం జరిగింది. డబ్బు కోసం భార్య నగ్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో పెట్టాడో భర్త. భార్య నగ్న దృశ్యాలు చూపించి డబ్బు చేసుకుంటున్నట్లు పోలీసుల గుర్తించారు. భర్త వంశీకాంత్‌రెడ్డి, వీడియోల కోసం డబ్బు చెల్లించిన శివకుమార్‌ను అరెస్టు చేశారు.
ఎయిర్ కార్గోలో ఉద్యోగమని నమ్మించి బాధితురాలిని వంశీకాంత్‌రెడ్డి వివాహామాడారు. కట్నం వేధింపుల ఆరోపణపై బాధితురాలి అత్తమామలపైనా కేసు పెట్టింది. బాధితురాలితో ఫోన్లో అసభ్యంగా మాట్లాడిన టెక్కలి వాసి సంతోష్‌పైనా కేసు నమోదు చేశారు. ఈ అరెస్టు వివరాలను గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి వెల్లడించారు.
సంబంధిత కథనం:
భార్య నగ్న వీడియోలతో వ్యాపారం.. దర్యాప్తులో విస్తుపోయే అంశాలు