ETV Bharat / city

మలేషియాలో గుంటూరు వ్యక్తి అరెస్టు: హోం మంత్రి

టూరిస్టు వీసాతో మలేషియా వెళ్లి ఉద్యోగం చేస్తున్న గుంటూరు వాసి నరసింహారావును అక్కడి పోలీసులు అరెస్టు చేశారని హోంమంత్రి సుచరిత తెలిపారు. అతడిని త్వరగా విడుదల చేయించడానికి కృషి చేస్తానని హామీఇచ్చారు.

హోంమంత్రి సుచరిత
author img

By

Published : Jul 28, 2019, 10:09 PM IST

హోంమంత్రి సుచరిత

ఉద్యోగం నిమిత్తం మలేషియా వెళ్లిన గుంటూరు జిల్లా వాసి నరసింహారావును పోలీసులు అదుపులోకి తీసుకోవడం బాధాకరమని హోంమంత్రి మేకతోటి సుచరిత ఆవేదన వ్యక్తం చేశారు. పిడుగురాళ్ల పట్టణానికి చెందిన నరసింహారావు... టూరిస్ట్ వీసాతో మలేషియా వెళ్లి ఉద్యోగం చేస్తున్నాడని... అందుకే అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. శాఖాపరమైన చర్యలు తీసుకుని అతడిని త్వరగా విడుదలయ్యేలా చూస్తామని హోంమంత్రి బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి...

దమ్ముంటే ఆరోపణలు నిరూపించండి: లోకేష్ సవాల్

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు.... కంట్రిబ్యూటర్

యాంకర్.... రాష్ట్రం ప్రగతి పధంలో నడిచేందుకు శక్తివంచన లేకుండా పని చేస్తున్నామని హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. గుంటూరు కృషి భవన్లో లో ఏర్పాటు చేసిన రూరల్ మండలం సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొన్నారు. గ్రామ ప్రజలు వద్ద నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముక్యంగా త్రాగునీరు, ఆర్ డబ్ల్యూ సి , ఇళ్ల స్థలాలు, విద్యుత్ కు సంబంధించిన సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు. వారి సమస్యలు పరిష్కరించే విధంగా తగిన చర్యలను తీసుకున్నామన్నారు. తక్షణమే గ్రామ ప్రజలు తెలిపిన సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించనట్లు తెలిపారు. గుంటూరు పరిధిలోని 11 గ్రామాల ప్రజా ప్రతినిధిల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నామని త్వరలోనే వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ సుజాత , ఆర్డీఓ భాస్కర్ రెడ్డి , తహసీల్దార్ మోహన్ రావు పలువురు అధికారులు హాజరయ్యారు.

Body:బైట్...మేకతోటి సుచరిత... హోం శాఖ మంత్రి

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.