ETV Bharat / city

అంబేడ్కర్​ ఆశయాలకు అనుగుణంగా సీఎం జగన్​ అడుగులు: హోం మంత్రి సుచరిత - blood donation camp at guntur

డా. బీఆర్​ అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో సీఎం జగన్ అడుగులు వేస్తున్నారని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని గుంటూరులో రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు.

blood donation camp at guntur
గుంటూరులో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన హోంమంత్రి
author img

By

Published : Apr 13, 2021, 3:52 PM IST

డా. బీఆర్ అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. అంబేడ్కర్​ 130వ జయంతిని పురస్కరించుకొని ఇవాళ, రేపు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని.. అందులో భాగంగానే గుంటూరులోని అంబేడ్కర్ భవనంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించినట్లు ఆమె తెలిపారు.

రాష్ట్ర ప్రజలకు మెరుగైన పాలన అందించడం కోసం సీఎం జగన్ అహర్నిశలు శ్రమిస్తున్నారని గుర్తు చేశారు. కరోనా వైరస్​ కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని.. అపోహలు వదిలి టీకా తీసుకోవాలని ప్రజలకు హోం మంత్రి సూచించారు. కార్యక్రమంలో గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, అంబేడ్కర్ అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

'మోదీకి క్లీన్​చిట్​' కేసు మరోసారి వాయిదా

నీళ్లనుకుని యాసిడ్​ తాగి దివ్యాంగురాలు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.