గుంటూరు జిల్లా మాచర్లలో ఎన్నిక ముగిసినా... ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. స్థానిక వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై ప్రతిదాడికి అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా పట్టణంలోని లాడ్జిల్లో ఉన్న తెదేపా నేతలను ఖాళీ చేయించారు. అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ఆర్కేకు పోలీసులు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పట్టణంలో భారీగా భద్రతా బలగాలు మోహరించారు.
ఇవీ చూడండి