సంగం డెయిరీ కేసులో ధూళిపాళ్ల క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణపై స్టే ఇవ్వాలని ధూళిపాళ్ల తరఫు న్యాయవాదులు కోరారు. ధూళిపాళ్లకు కరోనా సోకడంతో విచారణ చేయలేని పరిస్థితి ఉందని సీఐడీ తెలిపింది. కస్టడీ పొడిగింపుపై అ.ని.శా. కోర్టు విచారణ చేయాలని హైకోర్టు సూచించింది. డెయిరీ సమాచారాన్ని ప్రైవేట్ వ్యక్తులకు పోలీసులు ఇస్తున్నారని పిటిషనర్లు ఆరోపించారు. తదుపరి విచారణ జూన్ 17కు వాయిదా పడింది.
ఇదీ చదవండి: దేవినేని ఉమపై చర్యలు చేపట్టవద్దన్న ఆదేశాలు పొడిగింపు: హైకోర్టు