గుంటూరు జీజీహెచ్ వద్ద తెదేపా నేత జీవీ ఆంజనేయులును పోలీసులు అడ్డుకున్నారు. జీజీహెచ్‌లో కరోనా రోగులను పరామర్శించేందుకు జీవీ, ఇతర నేతలతో కలిసి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అనుమతించలేదు. వారి తీరును నిరసిస్తూ తెదేపా నేతలు జీజీహెచ్ ఎదుట బైఠాయించారు. ఆంజనేయులను అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి తరలించారు.
ఇవీ చూడండి: