గుర్రం జాషువా స్మృతిగా త్వరలో గుంటూరులో కళా ప్రాంగణం నిర్మించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో నవయుగ చక్రవర్తి గుర్రం జాషువా 125వ జయంతి వేడుకలు నిర్వహించారు. మంత్రి సురేష్, పలువురు వైకాపా నేతలు జాషువా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమాజంలోని వివక్షత తొలగించడం కోసం జాషువా ఎంతో కృషి చేశారని మంత్రి సురేశ్ అన్నారు.
ఇదీ చదవండి