గుంటూరు నగర ప్రజలు సమస్యలు వేగంగా పరిష్కారం అవ్వడానికి వార్డుల్లో ఉన్న సచివాలయాల్లో సంప్రదించాలని కమిషనర్ చల్లా అనురాధ చెప్పారు. ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదు, దరఖాస్తు ఆన్లైన్ చేయడం జరుగుతుందని, నిర్దేశిత సమయంలోగా పరిష్కారం జరుగుతుందని వివరించారు. సమస్యల పరిష్కారంపై సచివాలయ సిబ్బంది స్పందించకున్నా.. జాప్యం చేస్తే.. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సమస్యలు పరిష్కారం కోసం ప్రత్యేక కాల్ సెంటర్ 0863-2345103, 2345105 నంబర్లకు ఫిర్యాదు చేయాలన్నారు.
- నగర ప్రజల స్థానిక సమస్యలు అనగా..
ఇంటి పన్ను పేరు మార్పు, కొత్తగా ఇంటి పన్ను, ఖాళీ స్థలం పన్నులు విధింపునకు తదితర ఆస్థి సమస్యల పరిష్కారం కోసం, కొత్తగా మంచి నీటి కుళాయి కనెక్షన్, కుళాయి దార్జీల పన్ను తగ్గింపునకు, నూతన భవన నిర్మాణ అనుమతులకు, నూతన భవన ప్లాన్ కోసం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల చుట్టూ తిరగకుండా సచివాలయంలో పరిపాలన, సంబంధిత కార్యదర్శులను సంప్రదించాలి.
ఇదీ చదవండి: హైకోర్టు తీర్పును గౌరవించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు: నిమ్మగడ్డ