ఇళ్ల స్థలాలు వచ్చాయన్న సంతోషం ఆ పేదల్లో ఒక్క వర్షంతో తేలిపోయింది. కష్టపడి నిర్మాణ సామగ్రి పోగేసుకుంటే వరద అంతా తుడిచేసింది.
గుంటూరు జిల్లా నరసరావుపేటలో టిడ్కో ఇళ్ల సముదాయం పక్కనే 400 మంది పేదలకు 'జగనన్న కాలనీ'ల్లో భాగంగా ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఈనెల 8న అధికారులు నిర్మాణాలూ ప్రారంభించారు. లబ్ధిదారులు వారికి కేటాయించిన స్థలాల వద్ద ఇళ్లు కట్టుకునేందుకు సామగ్రి తెచ్చుకున్నారు. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి ఆ ప్రాంతం అంతా నీట మునిగింది. సామగ్రి నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. తవ్వుకున్న పునాదుల్లో మళ్లీ బురద నీరు చేరింది. ముంపునకు గురయ్యే ప్రాంతంలో స్థలాలు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకొన్నారని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు.
ఇదీ చదవండి: గుంటూరు జిల్లాలో భారీ వర్షం.. నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు