పాత గుంటూరులో దేవాలయాల వద్ద ఫ్లెక్సీలు పార్టీ కార్యాలయాలను తలపిస్తున్నాయంటూ.. దేవాదాయశాఖ అధికారులకు తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు. మీడియాలో వచ్చిన కథనాలపై స్పందిస్తూ.. భక్తులకు అసౌకర్యం కలిగించే ఆయా ఫ్లెక్సీలను తొలగించాలని కోరారు.
అగస్త్యేశ్వరస్వామి ఆలయం ఎదురుగా ఉన్న పలు ఫ్లెక్సీలు.. భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని తెదేపా నేత నసీర్ అహ్మద్ పేర్కొన్నారు. ప్రజలకు ఆటంకంగా ఉన్న వాటిని తొలగించి.. మున్ముందుకు ఇటువంటివి పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: