గుంటూరు లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వరస్వామి ఆలయం, కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడిని ఎస్పీ అమ్మిరెడ్డి సందర్శించారు. దేవాలయాలు, రథాల వద్ద భద్రత ఏర్పాట్లను సమీక్షించారు. ఆలయాల వద్ద పటిష్ఠమైన రక్షణ ఏర్పాట్లు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు అమర్చాలని నిర్వాహకులకు సూచించారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు.
ఇదీ చదవండి :