ఇదీ చదవండీ... 'శేషాచలం అటవీ ప్రాంతంలోకి రాకపోకలు నిషేధం'
గుంటూరు నగరాన్ని ఇలా ఎప్పడూ చూసి ఉండరు..! - lock down in guntur
గుంటూరు నగరంలో లాక్డౌన్ అమలు కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తోంది. సాధారణ రోజుల్లో వాహనాలు, ప్రజలతో కిటకిటలాడే ప్రాంతాలన్నీ బోసిపోయాయి. నగరంలో కరోనా పాజిటివ్ కేసులు 25 నమోదు కావటంతో లాక్డౌన్ నిబంధనలు కఠినం చేశారు. రాకపోకలు పూర్తిస్థాయిలో నియంత్రిస్తున్నారు. పాజిటివ్ కేసులు నమోదైన కాలనీల్లో ప్రజలను బయటకు రానీయకుండా చర్యలు చేపట్టారు. రెడ్‌జోన్ ప్రాంతాలు, ముఖ్యమైన కూడళ్లు, ప్రధాన రహదారుల్లో పరిస్థితిని పోలీసులు డ్రోన్ కెమెరాల ద్వారా చిత్రీకరించారు. విహంగ వీక్షణం ద్వారా గుంటూరులో లాక్డౌన్ అమలవుతున్న తీరును ఓసారి మీరూ చూడండి.
గుంటూరు నగరాన్ని ఇలా ఎప్పడూ చూసి ఉండరు..!
ఇదీ చదవండీ... 'శేషాచలం అటవీ ప్రాంతంలోకి రాకపోకలు నిషేధం'