ETV Bharat / city

గుంటూరులో లాక్​డౌన్ ప్రశాంతం

గుంటూరులో లాక్​డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. నగరంలోని రహదారులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నిత్యావసర సరకులు కొనుగోలు చేసేందుకు ప్రజలు నిర్దేశించిన సమయాల్లోనే బయటకు వస్తున్నారు. లాక్​డౌన్​తో ఇబ్బందులు పడుతున్న నిరాశ్రయులు, కూలీలకు కొందరు దాతలు ఆహారం అందిస్తున్నారు.

Guntur lockdown on 12 th day
గుంటూరులో లాక్​డౌన్ ప్రశాంతం
author img

By

Published : Apr 3, 2020, 12:34 PM IST

గుంటూరులో లాక్​డౌన్ ప్రశాంతం

గుంటూరులో 12వ రోజూ లాక్​డౌన్ కొనసాగుతుంది. నగరంలోని ప్రధాన రహదారులు బోసిపోయి కనిపిస్తున్నాయి. పోలీసులు తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యలు ఫలితాన్నిస్తున్నాయి. నిత్యావసరాల కోసం నిర్దేశించిన సమయంలోనే కూరగాయల మార్కెట్లు, కిరాణా దుకాణాల వద్ద మాత్రమే జనం ఉంటున్నారు. 11 గంటల తర్వాత వాహనాలు, జనం రోడ్లపై కనిపించడం లేదు. పోలీసులు అన్ని ప్రధాన మార్గాల్లో చెక్​పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకల్ని, ప్రజల కదలికల్ని నియంత్రిస్తున్నారు. వైద్య, పారిశుద్ధ్య సిబ్బందితో పాటు, ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అనుమతిస్తున్నారు. మందుల దుకాణాలు, బ్యాంకులు మాత్రం తెరిచే ఉంటున్నాయి. అక్కడ కూడా ప్రజల సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. నిరాశ్రయులు, రోజువారి కూలీలు లాక్​డౌన్ కారణంగా ఇబ్బందులు పడకుండా పలువురు దాతలు వారికి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. భాష్యం విద్యాసంస్థల ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో ప్రతిరోజూ ఆహారం అందజేస్తున్నారు. అరండల్ పేట పార్కు వద్దకు వాహనంలో భోజనం తీసుకువచ్చి పేదల ఆకలి తీరుస్తున్నారు. రోజూ 200 మందికి సరిపడా ఆహారం అందిస్తున్నట్లు వారు తెలిపారు.

ఇదీ చదవండి:

లాక్​డౌన్​: మందుబాబులకు తప్పని తిప్పలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.