గుంటూరులో లాక్డౌన్ ప్రభావం కన్పిస్తుంది. ఒక్క గుంటూరు నగరంలో 120 వరకు ఆస్పత్రులుండగా... కేవలం అత్యవసర వైద్యసేవలను మాత్రమే అందిస్తున్నారు. ఓపీ, సాధారణ సేవలను పూర్తిగా నిలిపివేశారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ఓల్డ్ క్లబ్ రోడ్ పరిసర ప్రాంతాలు, బస్టాండ్‌కు వెళ్లే మార్గాలు బోసిపోతున్నాయి. లాక్డౌన్ పరిస్థితిని స్థానిక ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా పరిశీలించారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం కట్టుదిట్టంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే చెప్పారు. ప్రజలు సహకరించాలని కోరారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని ఎమ్మెల్యే ముస్తఫా కోరారు.
గుంటూరులో లాక్డౌన్: అత్యవసర వైద్య సేవలు మినహా... - గుంటూరులో లాక్డౌన్
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రంలో లాక్డౌన్ ప్రకటించారు. ఫలితంగా వైద్య సేవలకు పేరొందిన గుంటూరు ఇప్పుడు వెలవెలబోతోంది. ఎప్పుడూ రోగులతో రద్దీగా ఉండే ఆసుపత్రులూ మూతపడ్డాయి. కేవలం అత్యవసర సేవలందించే వాటిని మాత్రమే అందుబాటులో ఉంచారు.
గుంటూరులో లాక్డౌన్ ప్రభావం కన్పిస్తుంది. ఒక్క గుంటూరు నగరంలో 120 వరకు ఆస్పత్రులుండగా... కేవలం అత్యవసర వైద్యసేవలను మాత్రమే అందిస్తున్నారు. ఓపీ, సాధారణ సేవలను పూర్తిగా నిలిపివేశారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ఓల్డ్ క్లబ్ రోడ్ పరిసర ప్రాంతాలు, బస్టాండ్‌కు వెళ్లే మార్గాలు బోసిపోతున్నాయి. లాక్డౌన్ పరిస్థితిని స్థానిక ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా పరిశీలించారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం కట్టుదిట్టంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే చెప్పారు. ప్రజలు సహకరించాలని కోరారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని ఎమ్మెల్యే ముస్తఫా కోరారు.
ఇవీ చూడండి-గుంటూరులో పకడ్బందీగా లాక్డౌన్ అమలు