ETV Bharat / city

నిర్లక్ష్యం ఖరీదు.. కరోనా మృతుల్లో రెండో స్థానంలో గుంటూరు

గుంటూరులో నిర్లక్ష్యపు నీడలో కరోనా విజృంభిస్తూనే ఉంది. రాష్ట్రంలో మహమ్మారి ప్రభావంతో నమోదైన అత్యధిక మరణాల్లో జిల్లా రెండవ స్థానానికి చేరింది. తాజాగా 359 మందికి వైరస్ నిర్దరణ కాగా.. ఒకరు మృతిచెందారు. మొత్తం కేసుల సంఖ్య 67,665కు చేరింది.

guntur-corona-updates
guntur-corona-updates
author img

By

Published : Oct 29, 2020, 9:53 PM IST

గుంటూరు జిల్లాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కొత్తగా జిల్లాలో 359 కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 67,665కు చేరింది. అత్యధికంగా గుంటూరు నగర పరిధిలో 65 కేసులు వెలుగుచూడగా... తెనాలిలో 41 కేసులు నమోదయ్యాయి. రేపల్లెలో 16, బాపట్లలో 15, దుగ్గిరాల, వట్టిచెరుకూరులో 13 మంది వైరస్ బారిన పడ్డారు. మంగళగిరి ప్రత్తిపాడు, మాచర్లలో పదేసి కేసులు చొప్పున నమోదయ్యాయి.

జిల్లాలో ఇప్పటివరకు 62, 373మంది కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్నారు. ఇవాళ మహమ్మారి కారణంగా ఒకరు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 614గా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో కరోనా కారణంగా అధిక మరణాలు సంభవిస్తోన్న జిల్లాల్లో గుంటూరు రెండోస్థానంలో నిలిచింది.

ఇదీ చదవండి:

'లబ్ధిదారులకు ఇళ్లు పంపిణీ చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.