గుంటూరు జిల్లాలోని సినిమా థియేటర్ యజమాన్యాలు.. ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ సూచించారు. ఈ మేరకు అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. సినిమా హాళ్లల్లో ప్రతి రెండు సీట్ల మధ్య ఒక సీటు ఖాళీగా ఉంచాలని సూచించారు.
మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజేషన్ కార్యక్రమాలను పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ అన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద థియేటర్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
ఇద చూడండి: