ETV Bharat / city

కరోనా ఎఫెక్ట్​ : కలెక్టరేట్​లో విధులకు పరిమిత సంఖ్యలో ఉద్యోగులు - guntur colllectorate latest news

గుంటూరు కలెక్టరేట్​లో పరిమిత సంఖ్యలో ఉద్యోగులు విధుల్లో ఉండాలని కలెక్టర్​ శ్యామ్యూల్​ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయంలోని ఓ ఉన్నతాధికారికి సోమవారం కరోనా నిర్ధరణ అయ్యింది. అతనితో పాటు పనిచేస్తున్న మరికొందరికి సోకడం వల్ల కలెక్టర్​ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

guntur collector orders to work with 50 percent employees in collectorate
గుంటూరు కలెక్టర్​ ఉత్తర్వులు జారీ
author img

By

Published : Jul 7, 2020, 2:52 PM IST

కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో గుంటూరు కలెక్టరేట్​లో పరిమిత సంఖ్యలో ఉద్యోగులు విధుల్లో ఉండాలని కలెక్టర్​ శ్యామ్యూల్​ ఆనంద్​కుమార్​ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ శాఖల్లో కరోనా విస్తరిస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కలెక్టరేట్​లోని వివిధ విభాగాల్లో 50 శాతం ఉద్యోగులను విధుల్లో ఉంచాలని, మరికొందరు ఇంటి నుంచి పనిచేయాలని సూచించారు. సోమవారం ప్రభుత్వం కార్యాలయంలోని ఓ ఉన్నతాధికారికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. అతనితో పనిచేస్తున్న మరికొందరికి ఈ వ్యాధి సోకడం వల్ల ఉద్యోగులు కలవరపడుతున్నారు.

ఇదీ చదవండి : కానిస్టేబుల్​కు కరోనా పాజిటివ్... రహదారి మూసివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.