ETV Bharat / city

పెరుగుతున్న కరోనా కేసులు.. అప్రమత్తమవుతున్న అధికారులు - guntur collector ordered to take over colleges and hotels

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న పరిస్థితుల్లో.. అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో 10 వేల బెడ్ల సామర్థ్యం గల క్వారంటైన్​, ఐసోలేషన్​ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. లాక్​డౌన్​ నేపథ్యంలో హోటళ్లు​, ఫంక్షన్​ హాల్స్​, కళాశాలలు, పాఠశాల భవనాలు స్వాధీనం చేసుకోవాలంటూ కలెక్టర్​ ఆదేశాలు జారీ చేశారు.

పెరుగుతున్న కరోనా కేసులు.. అధికార యంత్రాంగం అప్రమత్తం

author img

By

Published : Apr 2, 2020, 2:04 PM IST

కరోనా కేసులపై అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం

గుంటూరులో కరోనా ఉద్ధృతి పెరిగిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో ఇప్పటికే 9 పాజిటివ్ కేసులు నమోదు కాగా... దిల్లీ నిజాముద్దీన్ నుంచి వచ్చినవారి తాకిడి పెరగడం వల్ల ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 10 వేల బెడ్ల సామర్థ్యం గల క్వారంటైన్, ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 14 వరకు లాక్​డౌన్ అమల్లో ఉన్నందున హోటళ్లు, ఫంక్షన్ హాల్స్, కమ్యూనిటీ హాల్స్, కళాశాలలు, పాఠశాల భవనాలను స్వాధీనం చేసుకోవాలంటూ ఆర్డీవోలకు... కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. భవనాలే కాకుండా మానవ వనరులు, పరికరాలు, వాహనాలను సైతం తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం 28 ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాల్లో 226 మంది ఉండగా... 1,543 మంది హోం క్వారంటైన్లో ఉన్నారు. ప్రస్తుతం ఆస్పత్రి ఐసోలేషన్​లో 187 మంది ఉండగా... 141 మంది ఫలితాలు వెలువడాల్సి ఉంది.

ఇదీ చూడండి:

రాష్ట్రంలో 111 కరోనా కేసులు... ఒక్క రోజే 67 మందికి పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.