ETV Bharat / city

అకాల వర్షం.. మిర్చి రైతుకు శోకం

author img

By

Published : Feb 19, 2021, 9:15 PM IST

Updated : Feb 19, 2021, 9:41 PM IST

గుంటూరు జిల్లాలో అకాల వర్షం మిర్చి రైతుల్ని కష్టాల్లోకి నెట్టింది. మిర్చియార్డుకు తెచ్చిన సరుకు నీటిపాలైంది. సగం నష్టానికి సరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పొలాల్లోని మిర్చి కూడా వర్షం కారణంగా దెబ్బతినటం అన్నదాతలకు శోకం తెప్పించింది.

aws
అకాల వర్షం .. మిర్చి రైతుకు శోకం

అకాల వర్షం .. మిర్చి రైతుకు శోకం

గుంటూరు జిల్లాలో కురిసిన అకాల వర్షం రైతులకు శోకాన్ని మిగిల్చింది. నగరంలోని మిర్చియార్డుకు తెచ్చిన పంట మొత్తం నీట మునిగింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి గుంటూరు మిర్చి యార్డుకు రైతులు పంటను తీసుకువచ్చారు. అయితే అకస్మాత్తుగా వర్షం రావటంతో మిర్చి బస్తాలు తడిసిపోయాయి. వర్షం ప్రారంభం కాగానే కొందరు దుకాణాల్లోకి సరుకుని మార్చారు. మరికొందరు పట్టాలు కప్పారు. ఈలోగా చాలావరకు మిర్చి బస్తాలు తడిచిపోయాయి. దుకాణాల ముందుంచిన బస్తాల కిందకు నీరు చేసింది. కొందరు రైతులు తెచ్చిన మిర్చి తేమగా ఉండటంతో దాన్ని ఆరబెట్టారు. అది కూడా వర్షం కారణంగా తడిసిపోయింది.

ప్రభుత్వమే ఆదుకోవాలి..

గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు రాయలసీమ, తెలంగాణ నుంచి కూడా ఇక్కడికి మిర్చి పంటను తెస్తుంటారు. తడిసిన మిర్చిని కొనేందుకు ఎవరూ ముందుకు రారని... తాము తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శని, ఆదివారాలు మార్కెట్​కు సెలవు కావటంతో అప్పటికీ సరకు పూర్తిగా పాడైపోతుందని.. నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: అకాల వర్షాలతో తడిసిన పంటలు.. అందోళనలో అన్నదాతలు

Last Updated : Feb 19, 2021, 9:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.