రచయిత బైరిశెట్టి మల్లికార్జున రావు రచించిన ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర అనే పుస్తకాన్ని.. గుంటూరు ఎన్జీవో కళ్యాణమండపంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆవిష్కరించారు. గ్రూపు పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇందులో చరిత్ర, సామాజిక అంశాలు, ప్రస్తుత రాజకీయ అంశాలన్ని ఉన్నాయని చెప్పారు.
తాను మొదటిసారి రచించిన ఈ పుస్తకాన్ని అందరూ చదివి ఆశీర్వదించాలని పుస్తక రచయిత మల్లికార్జున రావు కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావుతోపాటు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రెజరిస్ అండ్ అకౌంట్స్ హనుమంతరావు, హిందూ కళాశాల వైఎస్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, తులసి గ్రూప్ కంపెనీ చైర్మన్ తులసి రామచంద్రప్రభు, తదితరలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
విశాఖ రైల్వే జోన్ ప్రకటనకు రెండేళ్లు.. నేటికీ కానరాని పురోగతి!