ETV Bharat / city

వైకాపా కార్యాలయానికి ప్రభుత్వ స్థలం.. లీజు ప్రాతిపదికన ఇష్టారాజ్యం..! - వైకాపా పార్టీ కార్యాలయానికి ప్రభుత్వ స్థలం కేటాయిస్తూ ఆమోదం

government land for YCP party office: గుంటూరు నగరపాలక సంస్థకు చెందిన సుమారు రూ.8 కోట్ల విలువైన ప్రజోపయోగ భూమిని.. వైకాపా జిల్లా కార్యాలయ నిర్మాణానికి లీజు ప్రాతిపదికన ధారాదత్తం చేయడానికి రంగం సిద్థమైంది. ఆ భూమి ఇవ్వడానికి అభ్యంతరం లేదని స్థాయీ సంఘం తీర్మానం చేసి.. దస్త్రాన్ని ప్రభుత్వ అనుమతికి పంపడం గమనార్హం.

YSRCP
వైకాపా కార్యాలయానికి ప్రభుత్వ స్థలం
author img

By

Published : Mar 18, 2022, 7:46 AM IST

government land for YCP party office: గుంటూరు నగరపాలక సంస్థలో కనీసం చర్చకు పెట్టకుండా.. చాలా విలువైన భూమిని వైకాపాకు కేటాయించాలనుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపాదిత భూమికి ఎదురుగా ప్రభుత్వ వైద్య కళాశాల బాలుర వసతిగృహం, మరికొద్ది దూరంలో ప్రభుత్వ జ్వరాల ఆస్పత్రి ఉంది. గుంటూరు ప్రభుత్వ బోధనాస్పత్రిలో కొన్ని వార్డుల విస్తరణకు ప్రస్తుతం ఆసుపత్రిలో ఖాళీ స్థలం లేదు. వైకాపా కార్యాలయానికి ప్రతిపాదిస్తున్న భూమిని ఆసుపత్రి విస్తరణకు కేటాయిస్తే ప్రయోజనకరంగా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భవిష్యత్‌లో నగరపాలక అవసరాలకు భూమి అవసరం ఏర్పడితే.. ఇంతకంటే అనువైన స్థలం మరొకటి దొరకదని ఉద్యోగ వర్గాలు అంటున్నాయి.

వైకాపా కార్యాలయానికి ప్రభుత్వ స్థలం

government land for YCP party office: ప్రస్తుతం నగరంలో అనేక సచివాలయాలు అద్దె భవనాల్లో నడుపుతూ... నెలకు రూ.లక్షల్లో అద్దెలు చెల్లిస్తున్నారు. కనీసం వాటిని నిర్మించినా అద్దెల భారం తప్పేదన్న వాదన ఉంది. అమరావతి రోడ్డులోని ప్రజలకు తాగునీరు అందించడానికి రిజర్వాయర్లు నిర్మించేందుకు గతంలో నగరపాలక సంస్థ ఈ స్థలాన్ని భూసేకరణ ద్వారా తీసుకుంది. అయితే ఇప్పటి వరకు రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టలేదు. ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలకు సుమారు 4 మీటర్ల దూరాన ఉన్న నెహ్రూ నగర్‌ రిజర్వాయర్, 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్మీపురం రిజర్వాయర్ల నుంచి నీటి సరఫరా చేస్తున్నారు.

government land for YCP party office: వైకాపా కేంద్ర కార్యాలయం సమన్వయకర్త, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి.. ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి స్థలాలు కేటాయించేలా బాధ్యులైన యంత్రాంగానికి ఆదేశాలివ్వాలని కోరుతూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. గుంటూరులోని కొరిటిపాడు సర్వే నెంబర్ 164/2లో ఉన్న 1.22 ఎకరాల భూమిని పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి కేటాయించాలని కోరారు. సదరు భూమి వివరాలతో గుంటూరు జిల్లా పాలనాధికారికి, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని లేఖలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి: టీడీఆర్ బాండ్ల అక్రమాలపై పురపాలక శాఖ విచారణ చేస్తోంది: మంత్రి బొత్స

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.