Goa alcohol sieged: బాపట్ల జిల్లా చీరాలలో అక్రమంగా తరలిస్తున్న గోవా మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు నుంచి చీరాలకు ఆటోలో మద్యం తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు.. ఆటో డ్రైవర్ సహా ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. మహిళలు ఇద్దరూ మూడురోజుల క్రితం చీరాల నుంచి నరసరావుపేట వెళ్లి, అక్కడి నుంచి రైలులో గోవాకు వెళ్లారు. గోవా నుంచి 281 మద్యం బాటిళ్లు కొనుగోలు చేసి గుంటూరుకు తీసుకువచ్చి, అక్కడి నుంచి చీరాలకు ఆటోలో తరలిస్తున్నారు. ఈ క్రమంలో చీరాల-వాడరేవు బైపాస్‌లో తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఎస్‌ఈబీ అధికారులు వీరిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ మహిళలు పాత నేరస్థులేనని గతంలో నాటుసారా అమ్ముతుండగా పట్టుబడ్డారని తెలిపారు.
ఇవీ చదవండి :