ETV Bharat / city

జీఎంసీలో యూజర్​ ఛార్జీల ప్రతిపాదనలపై సభ్యుల ఆగ్రహం..​.. ఆగిన చర్చ

గుంటూరు నగరపాలక సంస్థ సమావేశంలో యూజర్ ఛార్జీల వసూలు ప్రతిపాదనను విపక్షాలతో పాటు అధికార పక్ష సభ్యులు సైతం తప్పుబట్టారు. దీంతో చెత్త సేకరణకు యూజర్ ఛార్జీల వసూలు చేసే అంశంపై చర్చను ఆవేసి ఇతర అంశాలపై చర్చించారు.

author img

By

Published : Aug 27, 2021, 9:38 PM IST

fire on user charges at GMC meeting
జీఎంసీ సమావేశంలో యూజర్​ ఛార్జీలపై సభ్యులు ఫైర్

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో చెత్త సేకరణకు యూజర్ ఛార్జీల వసూలు చేసే అంశం ప్రస్తుతానికి ఆగిపోయింది. ఇవాళ జరిగిన కౌన్సిల్ సమావేశంలో.. యూజర్ ఛార్జీల ప్రతిపాదనను విపక్షాలతో పాటు అధికార పక్ష సభ్యులూ తప్పుబట్టారు. ప్రజల్లో అవగాహన కల్పించకుండా ఇష్టం వచ్చినట్లు ఛార్జీలు విధించడంపై సభ్యులు ప్రశ్నించారు. దీంతో ఈ అంశంపై చర్చను వాయిదా వేసి ఇతర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా.. బస్ బేల నిర్మాణానికి సంబంధించి పాలకమండలి ఆమోదం తెలిపింది. వీధిలైట్ల ఏర్పాటు, వీధి కుక్కల నివారణకు సంబంధించిన అంశాలను కౌన్సిల్ ఆమోదించింది. నగరంలోని ప్రతి డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులకు సంబంధించి రూ.50లక్షలు మంజూరుకు సభ్యులంతా అంగీకరించారని మేయర్ కావటి మనోహర్ నాయుడు తెలిపారు.

అయితే బస్ బేల ఏర్పాటు, యూజర్ ఛార్జీల అంశంపై చర్చ సమయంలో అధికార వైకాపా, తెదేపా సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఓ దశలో అధికార పార్టీ కార్పొరేటర్లు.. తెదేపా కార్పొరేటర్ల వైపు దూసుకెళ్లారు. సమావేశంలో పాల్గొన్న గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా సైతం తెదేపా సభ్యులపై అగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదండి..: couple death case: 'భార్యను హత్య చేసి.. భర్త ఉరివేసుకున్నట్టు భావిస్తున్నాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.