గుంటూరు జిల్లా మంగళగిరిలో గంజాయి విక్రయిస్తున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 5.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నలుగురు యువకులు ముఠాగా ఏర్పడి విశాఖ జిల్లాలోని ఓ వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్నారు. దాన్ని ప్యాకెట్లుగా మార్చి స్థానిక కళాశాలల విద్యార్థులకు విక్రయిస్తున్నారని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి పేర్కొన్నారు.
గంజాయి క్రయవిక్రయాలు చేస్తున్న వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అమ్మిరెడ్డి హెచ్చరించారు. గంజాయి విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు అర్బన్ పరిధిలోని ప్రముఖ కార్పొరేట్ కళాశాలల వద్ద నిఘా ఏర్పాటు చేస్తామన్నారు.
ఇదీ చూడండి: